Home  »  TV News  »  Brahmamudi : రాజుపై ఫైర్ అయిన భ్రమరాంబ.. నందు, వెంకీల కామెడీ ట్రాక్!

Updated : May 22, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1038 లో....భ్రమరాంబ కార్ తీసుకొని రాజు వెళ్తాడు. నా కార్ ని ఏం చేస్తాడోనని భ్రమరాంబ టెన్షన్ పడుతుంది. అప్పుడే రాజు వస్తాడు. నువ్వు ఇంకొకసారి నా కార్ ని తీసుకెళ్ళకని భ్రమరాంబ అంటుంది. మరొకవైపు వెంకీకి లవ్ ఫెయిల్యూర్ అయిందని నందు తనకి ఒక మంచి అమ్మాయిని సెట్ చెయ్యాలని అనుకుంటుంది. వెంకీకి ఒక అమ్మాయితో రెస్టారెంట్ లో మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఆ అమ్మాయి చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. దాంతో మీరు నాకు సెట్ అవ్వరని వెంకీ డిస్సపాయింట్ అవుతాడు.

ఆ తర్వాత రాజుకి చలపతి, లక్ష్మి వీడియో కాల్ చేస్తారు. రాజుని సూట్ లో చూసి షాక్ అవుతారు. ఏంట్రా నువ్వు అంత ఖరీదైన సూట్ వేసుకున్నావని చలపతి మాట్లాడతాడు. బిజినెస్ పనిలో ఉన్నానని రాజు చెప్తాడు. కాసేపు వాళ్ళతో మాట్లాడుతాడు రాజు. ఫోన్ మాట్లాడి రాజు వెనక్కి తిరిగి చూసేసరికి అపర్ణ ఉంటుంది. ఇక రాజుని చూసి అపర్ణ ఎమోషనల్ అవుతుంది. నిన్ను మా కష్టాలు తీర్చడానికి దేవుడు పంపించాడని అపర్ణ అంటుంది. కానీ మా ఇందు పరిస్థితి చూసావ్ కదా ఎలా ఉందో ఇరుకుగదిలో అని అపర్ణ బాధపడుతుంటే ఆ విషయం నాకు వదిలెయ్యండి అని రాజు అంటాడు. ఆ తర్వాత మరొక అమ్మాయితో వెంకీకి మీటింగ్ ఏర్పాటు చేస్తుంది నందు. ఆ అమ్మాయి కూడా బోల్డ్ గా మాట్లాడుతుంది. నువ్వు నాకు సెట్ కావు అని ఆ అమ్మాయిని వెళ్లిపొమ్మని చెప్తాడు వెంకి.

అన్ని ఎందుకు అలా చెడగొట్టుకుంటున్నావని వెంకీపై నందు కోప్పడుతుంది. మరొకవైపు రాజు కోపంగా ఇంట్లో అందరిని పిలుస్తాడు. అందరు రాగానే నేను ఈ ఇంటికి ఏమవుతానని అడుగుతాడు. అల్లుడు అని భ్రమరాంబ అంటుంది. అయితే నాకూ భార్యకి అలాంటి గది ఇస్తారా అని కోప్పడతాడు. దాంతో మీకు ఏసీ గదిని ఏర్పాటు  చేస్తానని రేఖ, భూషణ్ చెప్తారు. తరువాయి భాగంలో రాజుని సీఈఓకి పోటీ చెయ్యమని ఇందు చెప్తుంది. మరొకవైపు రేఖ దగ్గరికి ఇందు వెళ్లి మీకు ఆ రాజు ఎదురుతిరగాలని చూస్తున్నాడు సీఈఓగా పోటీ చెయ్యాలనుకుంటున్నాడని చెప్తుంది. దాంతో రేఖ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.